ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకం కింద మొదటి సంవత్సరం (1st Class) మరియు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ నెల 30న రూ.13,000 చొప్పున జమ చేయనుంది. సాంకేతిక కారణాల వల్ల గత నెలలో లబ్ధి పొందని వారికి కూడా అదే రోజున నిధులు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
అర్హత ఉన్న విద్యార్థులు ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. సుమారు 2.78 లక్షల మంది నూతన విద్యార్థులకు ఈ నిర్ణయంతో లబ్ధి చేకూరనుంది.