Alpha-Supermarket-Nandigama rtc bus stand
ఆల్ఫా ‘పార్కింగ్’ మాయ.. నందిగామ రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు!
నందిగామ: ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో నిబంధనల ఉల్లంఘనలు పరాకాష్టకు చేరాయి. కనీస పార్కింగ్ సదుపాయం కూడా లేకుండా నిర్మించిన ఒకే ఒక్క వాణిజ్య సముదాయం.. ఇప్పుడు పట్టణ ప్రజలకు ప్రయాణికులకు నరకం చూపుతోంది. ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన కొత్తగా వెలసిన ఆల్ఫా సూపర్ మార్కెట్ వల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్యలు Alpha Supermarket Nandigama తలెత్తుతున్నాయి. మున్సిపల్ అధికారులు పార్కింగ్ నిబంధనలను గాలికొదిలేసి ఈ సూపర్ మార్కెట్‌కు ఎలా అనుమతులు ఇచ్చారనే దానిపై ఇప్పుడు స్థానికుల్లో తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రోడ్డుపైనే వాహనాలు.. ప్రాణసంకటంలో పాదచారులు!
సూపర్ మార్కెట్‌కు వచ్చే వందలాది మంది వినియోగదారులు తమ వాహనాలను Alpha Supermarket Nandigama నిలపడానికి లోపల స్థలం లేకపోవడంతో, విధిలేక జాతీయ రహదారిపైనే పార్క్ చేస్తున్నారు. దీంతో రోడ్డంతా వాహనాలతో నిండిపోయి తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులు, సాధారణ పాదచారులు నడవడానికి కూడా స్థలం లేక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని రోడ్డు దాటాల్సి వస్తోంది. ఏ క్షణంలో ఏ వాహనం ముంచుకొస్తుందో తెలియని ప్రమాదకర స్థితి ఇక్కడ నెలకొంది. ఈ నిబంధనల ఉల్లంఘన వల్లే నందిగామలో ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు మండిపడుతున్నారు.
నిత్యం గొడవలు.. ఆటో డ్రైవర్ల ఆవేదన
గతంలో బస్టాండ్ సమీపంలో ఆటోలను క్రమపద్ధతిలో నిలుపుకునేవాళ్లమని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని ఆటో డ్రైవర్లు స్పష్టం చేస్తున్నారు. కానీ, ఈ ఆల్ఫా సూపర్ మార్కెట్ వచ్చినప్పటి Alpha Supermarket Nandigama నుంచి తమ ఉపాధి దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూపర్ మార్కెట్ ముందు స్థలం చాలక, కస్టమర్లు తమ వాహనాలను ఎదురుగా ఉన్న షాపుల ముందు, ఆటో స్టాండ్ స్థలంలో నిలుపుతున్నారు. దీనివల్ల స్థానిక దుకాణదారులకు, వాహనదారులకు నిత్యం తీవ్రస్థాయిలో ఘర్షణలు (గొడవలు) జరుగుతున్నాయి. ట్రాఫిక్ గందరగోళం కారణంగా ప్రయాణికులు ఆటోలు ఎక్కడానికి కూడా సుముఖత చూపడం లేదని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల పాత్రపై అనుమానాలు: నందిగామ సైదా ఘాటు విమర్శలు
ఈ తీవ్ర ట్రాఫిక్ సమస్యపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నందిగామ సైదా తీవ్రంగా స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కనీస పార్కింగ్ సదుపాయం లేని ఆల్ఫా సూపర్ మార్కెట్‌కు అధికారులు ఏ ప్రాతిపదికన Alpha Supermarket Nandigama అనుమతులు ఇచ్చారని ప్రశ్నించారు. ఈ మార్కెట్ వల్ల కేవలం ట్రాఫిక్ సమస్యే కాకుండా, ఆటో డ్రైవర్ల పొట్టకొట్టే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. అధికారులు తక్షణమే స్పందించి, రోడ్డుపై వాహనాలు నిలపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని డిమాండ్ చేశారు.
పట్టణ నడిబొడ్డున ఇంతటి నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా మున్సిపల్, ట్రాఫిక్ పోలీసులు కళ్ళుండీ చూడలేనట్లు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని నందిగామ ప్రజలు కోరుతున్నారు.