vatsavai badibata

vatsavai badibata : వత్సవాయిలో ‘బడి బాట’ కార్యక్రమం!

వత్సవాయి (ఎన్టీఆర్ జిల్లా): పిల్లల భ‌విష్య‌త్తు కోసం బంగారు బాటలు వేసేలా, ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అత్యాధునిక విద్యా సదుపాయాలపై అవగాహన కల్పించేందుకు వత్సవాయి మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో vatsavai badibata వైభవంగా జ‌రిగింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు దారేల్లి చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులతో కలిసి ఆయన స్థానికంగా ఉండే తల్లిదండ్రులకు ప్రభుత్వ విద్యా విధానాలపై అవగాహన కల్పించారు.

ప్రభుత్వ స్కూల్స్‌లో మెరుగైన వసతులు:

ఈ సందర్భంగా దారేల్లి చిరంజీవి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ప్రైవేటుకు ధీటుగా నాణ్యమైన విద్యా బోధన vatsavai badibata అందించ‌డం జ‌రుగుతుంద‌ని స్పష్టం చేశారు. విద్యార్థుల వికాసానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే మధ్యాహ్న భోజనం, ఉచిత విద్య‌, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత యూనిఫారాలతో పాటు డిజిటల్ విద్యను కూడా ప్రోత్సహించేందుకు ఐఎఫ్‌పీ (IFP) స్క్రీన్స్ వంటి ఎన్నో మెరుగైన వసతులను ప్ర‌భుత్వం కల్పించడం జరిగిందని ఆయన వివరించారు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి:

రాష్ట్ర భవిష్యత్తు మార‌డంలో భావి తరాల నిర్మాణంలో విద్యార్థుల పాత్రే అత్యంత కీలకమని చిరంజీవి పేర్కొన్నారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రైవేట్ సంస్థలకు పంపించి ఆర్థికంగా భారం పడకుండా, రూపాయి ఖర్చు లేకుండా విద్య నేర్పే పాఠ‌శాల‌లు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లు అని అన్నారు. కార్పొరేట్ స్థాయి విద్యనందించే ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ vatsavai badibata ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సువర్ణ అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగం పంచుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక విద్యాశాఖ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top