న్యూస్ డెస్క్ (NDG న్యూస్ మీడియా): కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ-20 (E-20) ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ఇప్పుడు సాధారణ వాహనదారుల్లో తీవ్ర ఆందోళన పుట్టిస్తోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు, మొక్కజొన్న మరియు చెరుకు రైతులను ఆర్థికంగా ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఇథనాల్ కలయిక petrol ను మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కొత్త ఇంధన వల్ల పాత వాహనాలు కలిగిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పాత వాహనాలకే పెద్ద తిప్పలు!
ముఖ్యంగా 2022 లేదా అంతకంటే ముందు ఏడాది కాలంలో కొనుగోలు చేసిన బైకులు, కార్ల యజమానులు ఈ ఈ-20 పెట్రోల్‌తో తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం petrol బంకుల్లో లభిస్తున్న ఈ ఇంధనాన్ని వాడటం వల్ల ప్రతి పదిమంది వాహనదారులలో ఐదుగురు తమ బండి మైలేజీ దారుణంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇంజిన్ సమస్యలు కూడా వచ్చి తరచూ వాహన రిపేర్లు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
అధికారులు ఏం చెబుతున్నారు
ఇథనాల్ బ్లెండింగ్ కారణంగా 2023 కంటే ముందు మోడల్ వాహనాలలో కేవలం 1 నుంచి 6 శాతం వరకు మాత్రమే మైలేజీ తగ్గే అవకాశం ఉందని అధికారులు ఒక వైపు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాహన ఓనర్లు మాత్రం గతం కంటే ఏకంగా 20 శాతం వరకు మైలేజీ పడిపోతోందని లెక్కలతో సహా నిరూపిస్తున్నారు.

ఇంధన ధరలు సెగలు పుట్టిస్తున్న ఈ తరుణంలో ఇలా మైలేజీ కూడా భారీగా తగ్గిపోతుండటం సామాన్యుడి జేబుకు అదనపు చిల్లు పెడుతుందని తెలుస్తోంది. ఈ-20 పెట్రోల్ వల్ల వస్తున్న ఇంజిన్ రిపేర్లపై మెకానిక్‌లు సైతం పాత ఇంజిన్లు ఇథనాల్‌ను తట్టుకోలేకపోతున్నాయని వారు కూడా చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
