cockroach

cockroach : ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనం.. అసలేంటి ఈ ‘కాక్రోచ్’ పార్టీ?

భారతీయ రాజకీయాల్లో, సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా “కాక్రోచ్ జనతా పార్టీ” (Cockroach Janta Party) గురించే పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. అసలు ఏ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేని ఈ cockroach పేజీ.. కేవలం కొన్ని రోజుల్లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 1.5 కోట్లకు అంటే (15 Million) పైగా ఫాలోవర్లను సంపాదించి ఇంకా ముందుకు వెళుతుంది. దేశంలోని పెద్ద పెద్ద అధికార పార్టీల రికార్డులను సైతం ఈ పార్టీ ఇప్ప‌టికే బ్రేక్ చేసింది.

ఎందుకు పెట్టారు? అసలు కథేంటి?

మే 15న సుప్రీంకోర్టులో జరిగిన ఒక విచారణ సందర్భంగా.. కొంతమంది నిరుద్యోగ యువత సామాజిక మాధ్యమాల్లో యాక్టివిస్టులుగా మారి వ్యవస్థపై దాడులు చేస్తున్నారని, వారు సమాజానికి బొద్దింక‌లు (Cockroaches) లాంటివారని ఒక మాట‌ రావడం తీవ్ర దుమారం రేపింది. అక్క‌డి నుంచే ఇది మొద‌లైంది.

యువత నిరసన: ఈ వ్యాఖ్యలపై దేశంలోని నిరుద్యోగ యువత ముఖ్యంగా జెన్-జీ (Gen Z) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వ్యంగ్యంతో సమాధానం: దీనికి ప్రతిస్పందనగా మే 16న అభిజీత్ దీప్కే అనే సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్.. అవును, మేము బొద్దింక‌ల‌మే అంటూ వ్యంగ్యంగా (Satirical) ఈ కాక్రోచ్ జనతా పార్టీని డిజిటల్ వేదికగా స్థాపించారు. “Voice of the Lazy & Unemployed” (సోమరులు, నిరుద్యోగుల గొంతుక) అనే ట్యాగ్‌లైన్‌తో ఈ క్యాంపెయిన్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్ట్ చేశారు.

cockroach
cockroach

రాజకీయ నాయకులు భయపడుతున్నారా?

ఈ డిజిటల్ ఉద్యమాన్ని చూసి ట్రెడిషనల్ రాజకీయ పార్టీలు, లీడర్లు లోలోపల కంగారుపడుతున్నారనేది జ‌గ‌మెరిగిన ప‌చ్చి నిజం.

  • పెద్ద పార్టీలకే షాక్: ఇన్‌స్టాగ్రామ్‌లో దశాబ్దాల చరిత్ర ఉన్న బీజేపీ, కాంగ్రెస్, ఆప్ వంటి ప్రధాన పార్టీల ఫాలోవర్ల సంఖ్యను ఈ పేజీ కేవలం 4 నుంచి 5 రోజుల్లోనే దాటేసింది.
  • యాక్షన్ ప్లాన్: ఇది కేవలం ఆన్‌లైన్ మీమ్స్‌కే పరిమితం కాకుండా.. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, పరీక్షల అవినీతిపై యువతలో తీవ్రమైన పొలిటికల్ అవేర్‌నెస్ తెస్తుండటంతో లీడర్లు అలర్ట్ అవుతున్నారు. ఇటీవల ఈ పార్టీకి సంబంధించిన అకౌంట్స్‌పై ఆంక్షలు విధించే ప్రయత్నాలు జరగడమే దీనికి బ‌లంగా మారింది. అంటే ఎంత భ‌య‌ప‌డుతున్నారో ఇక్క‌డ అర్థం చేసుకోవ‌చ్చు.

ఈ పార్టీ వ‌ల్ల జ‌నానికి ఉప‌యోగం ఏంటి..?

అయితే ఇక్క‌డ గుర్తించాల్సిన విష‌యం ఏంటంటే ఇది ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన నిజమైన పొలిటికల్ పార్టీ కాదు. కానీ ప్రస్తుత సమాజంలో ఈ పార్టీ యువతకు ఒక ఆయుధంగా మారింది. కానీ ముందుకు వెళుతుందా.. లేకా ఆగిపోతుందా అనేది వేచి చూడాలి.

ప్రశ్నించే గొంతుక: దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో ప్రభుత్వాలకు అర్థమయ్యేలా చేయడానికి ఈ ప్లాట్‌ఫారమ్ ఉపయోగపడుతోంది. దీని వ‌ల్ల ప్ర‌శ్నించ‌డానికి ఒక ఆయుధంగా ప‌నికి వ‌స్తుంది. దీనికి స‌రైన విధంగా న‌డ‌ప‌గ‌లిగితే మ‌రింత బ‌లంగా ఈ పార్టీ మారుతుంది.
నిలబడుతుందా?.. త‌డ‌బ‌డుతుందా : ఇది ఎన్నికల్లో ఓట్లు సీట్లు గెలవకపోయినా, డిజిటల్ ప్రపంచంలో ప్రభుత్వాల తప్పులను ఎండగట్టే ఒక పవర్‌ఫుల్ అస్త్రంగా మారింది. నిరసన వేదికగా లాంగ్ రన్ లో కచ్చితంగా నిలబడుతుంది అనేది యువ‌త చెప్పె విష‌యం. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఒక మంచి వేదిక మాత్రం ఇది.

ఇవి కూడా చదవండి (Recent Links)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top